వరంగల్ గ్రామీణ జిల్లా బండౌతాపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రారంభించారు. ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు తెలిపారు.
'ప్రతీ గింజనూ కొంటాం.. ఎవరూ అధైర్యపడొద్దు..'
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకే కొంటామని... రైతులెవరూ అధైర్యపడొద్దని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు.
'ప్రతీ గింజనూ కొంటాం.. ఎవరూ అధైర్యపడొద్దు..'
ఎవరూ ఆధైర్యపడొద్దని... సంయమనం పాటిస్తూ టోకెన్ల పద్దతిలో ధాన్యాన్ని విక్రయించాలని పేర్కొన్నారు. లాక్డౌన్ అమలులో ఉన్న కారణంగా రైతులు సామాజిక దూరాన్ని పాటించాలని... నిత్యం పరిశుభ్రతను పాటించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.