కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపటి భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కోరారు. వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేయాలని భాజపా చూస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీరు వల్లే రైతులు భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుందని అన్నారు.
'బంద్‌లో తెరాస శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలి'
కేంద్రం అమలు పరుస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపటి భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కోరారు. రైతుల నిరసనకు తెరాస మద్దతుగా ఉంటుందని తెలిపారు.
'బంద్‌లో తెరాస శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలి'
రైతుల నిరసనకు ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. రేపటి బంద్‌లో పార్టీ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.