తెలంగాణ

telangana

ETV Bharat / state

ACCIDENT: తెల్లారక ముందే తెల్లవారిన బతుకులు.. ఇద్దరు దుర్మరణం - వరంగల్ గ్రామీణ జిల్లా లో రోడ్డు ప్రమాదం

వరంగల్ గ్రామీణ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన ఇసుక లారీ ఇద్దరి ప్రాణాలను తీసింది. ఈ రోజు తెల్లవారు జామున 5 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్​తో సహా ఓ మహిళ దుర్మరణం పాలైంది. దామెర మండలం ఒగ్లాపూర్ సైలాని బాబా దర్గా సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.

accident
వరంగల్ గ్రామీణ జిల్లాలో విషాదం

By

Published : May 30, 2021, 11:01 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి ఓ ఆటోను ఢీ కొట్టిన ఘటనలో ఒక మహిళా, ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ కూరగాయల మార్కెట్ నుంచి ఇద్దరు మహిళలతో ఆటో పరకాల మార్కెట్​కు వెళ్తోంది.

అదే క్రమంలో దామెర మండలం ఒగ్లాపూర్ సైలాని బాబా దర్గా సమీపంలోని జాతీయ రహదారి వద్దకు రాగానే అతి వేగంగా వచ్చిన ఇసుక లారీ ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళా వ్యాపారి, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వరంగల్ ఎంజీఎంకు తరలించిన పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details