గిరిజనులు ఆత్మగౌరవంతో జీవించేలా సీఎం కేసీఆర్ పాలిస్తున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. తండాలను తామే పాలించుకునే అవకాశాన్ని కల్పించారని కొనియాడారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
'గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్'
కోట్లాది గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. గిరిజనులు ఎలా అభివృద్ధి చెందాలో 280 ఏళ్ల క్రితమే సేవాలాల్ మహారాజ్ నేర్పించారని తెలిపారు.
'కోట్లాది గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్'
సేవాలాల్ మహారాజ్ గిరిజనులకు ఒక మంచి మార్గాన్ని చూపించారని సత్యవతి రాఠోడ్ అన్నారు. వారి నుంచి స్ఫూర్తి పొంది.. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని తెలిపారు. తెరాస ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతోందని ఆమె వెల్లడించారు.