తెలంగాణ

telangana

ETV Bharat / state

తాటి వనం దగ్ధం... ఉపాధి కోల్పోయిన కుటుంబాలు - పరకాలలో తాటి వనం దగ్ధం

రాష్ట్ర వ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతోంది... కానీ ఒక్కసారిగా ఆ గ్రామశివారులో మంటలు చేలరేగాయి... ఆ మంటల్లో సుమారు 50 తాటి చెట్లు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది.

the palm forest fire is family losing their jobs in parkal
తాటి వనం దగ్ధం... ఉపాధి కోల్పోయిన కుటుంబాలు

By

Published : Apr 17, 2020, 5:54 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పట్టణ శివారులో తాటి వనం అగ్నికి ఆహుతైంది. సుమారు 50 చెట్లు దగ్ధమయ్యాయి. ఆ మంటలు సుమారు అర కిలోమీటరు వరకు వ్యాపించాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు అర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు.

ఆ ప్రమాదంలో కాలిన చెట్లతో దాదాపు 20 మంది గీత కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయారని సమాచారం. లాక్​డౌ​న్​ వేళ ఆ సంఘటనా స్థలంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

తాటి వనం దగ్ధం... ఉపాధి కోల్పోయిన కుటుంబాలు

ఇదీ చూడండి :వైద్య కళాశాలలో కరోనా నిర్ధరణ కేంద్రం ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details