హరితహారంలో నాటిన మొక్కలను మేకలు తిన్నాయని సదరు యజమానికి జరిమానా విధించిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా ఇల్లందలో చోటుచేసుకుంది. గత నెల 19న జిల్లా కలెక్టర్ హరిత, కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ చేతుల మీదగా హరితహారంలో భాగంగా ఇల్లందలోని హనుమాన్ దేవాలయం వద్ద మొక్కలు నాటారు. సెప్టెంబర్ 2న ఇదే గ్రామానికి చెందిన దుస్సా లింగయ్యకు చెందిన మేకలు.. 150 మొక్కలను తిన్నాయని విచారణ చేపట్టి పరిహారం కింద రూ. 37,500/- జరిమానా విధించారు. 15 రోజుల్లో జరిమానా కట్టకపోతే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేశారు.
మొక్కను తిన్న మేక... యజమానికి రూ. 37వేల జరిమానా
హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను మేకలు తిన్నాయని సదరు యజమానికి రూ. 37,500/- జరిమానా విధించిన ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటుచేసుకుంది.
యజమానికి రూ. 37వేల జరిమానా