వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో మాజీ మంత్రి బి.సమ్మయ్య వర్ధంతిని నిర్వహించారు. పలువురు స్థానిక నేతలు హాజరై, నివాళులు అర్పించారు. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన సమ్మయ్య పేద ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని నేతలు కొనియాడారు. పరకాల గ్రామం నుండి మంత్రిగా ఎదిగిన ఏకైక వ్యక్తి బొచ్చు సమ్మయ్య అని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మెన్ కట్కూరి దేవేందర్ రెడ్డి, జన్ను అలెగ్జాండర్, రేనుకుంట్ల విల్సన్, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పరకాలలో మాజీమంత్రి వర్ధంతి సభ - The former minister
పరకాలలో మాజీమంత్రి సమ్మయ్య వర్ధంతి సభ నిర్వహించారు.
ఘనంగా మాజీ మంత్రి వర్ధంతి వేడుకలు