పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఖాళీ గ్యాస్ సిలెండర్లతో నిరసన తెలిపారు. ప్రజలపై కేంద్రం అధికభారం మోపుతోందని ఆరోపించారు.
కేంద్రంలో భాజపా అధికారంలోకి రావడానికి.. ప్రజాసంక్షేమ పధకాలను తీసుకొస్తామని ఎన్నికల ముందు చెప్పింది. ఇప్పుడు మాత్రం ధరలను పెంచి ప్రజలపై అధికభారం మోపుతోంది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం.