Warangal MGM Hospital : వరంగల్‌లో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి... ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని క్యాజువాలిటీలో రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించారు. కాసేపు దవాఖానా అంత తిరిగి.. సమస్యలు, మౌలిక సదుపాయాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి కావాల్సిన ఆధునిక సదుపాయాలు, యంత్రాల గురించి వైద్యులతో చర్చించారు. దేశంలోనే అతిపెద్ద వైద్య కేంద్రంగా వరంగల్ ఎంజీఎంను తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు.
'వరంగల్‌లో.. దేశంలోనే అతిపెద్ద వైద్య కేంద్రం' - వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎర్రబెల్లి
Errabelli at MGM Hospital : దేశంలోనే అతిపెద్ద వైద్య కేంద్రంగా వరంగల్ ఎంజీఎంను తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. ఎంజీఎంలోని క్యాజువాలిటీలో 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సీటీస్కాన్ యంత్రాన్ని ప్రారంభించారు. ఆస్పత్రిలో కాసేపు తిరిగిన మంత్రి.. సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన గురించి అధికారులతో చర్చించారు.
"వరంగల్ ఆస్పత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. త్వరలో రూ.17 కోట్లతో ఎన్‌ఆర్‌ఐ సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం. త్వరలోనే ఎంజీఎంలో 60 ఏళ్లు పైబడిన వారికి మోకాళ్ల శస్త్రచికిత్సలు చేసేలా చర్యలు తీసుకుంటాం. దేశంలోనే తొలిసారిగా 22 అంతస్తుల స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నాం. కార్పొరేట్ ఆస్పత్రి ద్వారా ప్రభుత్వ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న సమస్యల గురించి.. ఇంకా కావాల్సిన సదుపాయల గురించి తెలుసుకున్నాను. త్వరలోనే వాటిని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటాం." -- ఎర్రబెల్లి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి