తెలంగాణ

telangana

ETV Bharat / state

వేసవి సెలవులే శిక్షణా సమయాలు - girls

వేసవి సెలవులు వచ్చాయంటే చిన్నారులు తమ బంధువుల ఊళ్లకు, విజ్ఞాన యాత్రలకు వెళ్లేవారు. కానీ ప్రస్తుతం సమయాన్ని వృథా చేయకుండా భవిష్యత్తుపై దృష్టి సారించి నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఇటీవల పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు వేసవి సెలవుల్లో గత కొద్ది రోజులుగా కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు.

వేసవి సెలవులే శిక్షణా సమయాలు

By

Published : Apr 19, 2019, 6:12 AM IST

Updated : Apr 19, 2019, 8:07 AM IST

వేసవి సెలవులే శిక్షణా సమయాలు

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో వేసవికాల శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 10 పాఠశాలలకు చెందిన 100 మంది విద్యార్థినులు ఈ నెల 9 నుంచి శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 25 వరకు శిబిరం కొనసాగనుంది. కంప్యూటర్ కోర్సులో శిక్షణ పొందడం వల్ల భవిష్యత్​లో తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వేసవి సెలవులు వచ్చాయంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది చూడకుండా సమయాన్ని వృథా చేసుకోకుండా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టి సారించడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.

గురుకుల పాఠశాలల అధికారులు సైతం శిబిరాన్ని తరచూ పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు.

ఇవీ చూడండి:

మహిళా సాధికారత దిశగా మెట్రో 'తరుణి'

Last Updated : Apr 19, 2019, 8:07 AM IST

ABOUT THE AUTHOR

...view details