మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో శనివారం సాయంత్రం భారీగా వడగళ్ల వాన పడింది. కోత దశకు వచ్చిన వరి నేల వాలింది. మిర్చి, మొక్కజొన్న మిరప పంటలకూ నష్టం వాటిల్లింది. వడగండ్లకు పుచ్చకాయలు సైతం పగిలిపోయాయి.
వడగళ్ల వాన... వెయ్యి ఎకరాల్లో పంట నష్టం! - మహబూబాబాద్
పంట చేతికి వచ్చే సమయంలో శనివారం రోజున ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. కోతకు వచ్చిన వరి, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పంటలు, అమ్మకానికి సిద్ధంగా ఉన్న పుచ్చకాయ పంటలు అకాల వర్షంతో దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రైతులు అమ్ముకునే అవకాశం ఆందోళన చెందుతున్నారు.
వడగళ్ల వాన... వెయ్యి ఎకరాల్లో పంట నష్టం!
ఈ రెండు జిల్లాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వందల క్వింటాళ్ల మక్కలు కూడా తడిసిపోయాయని రైతులు వాపోతున్నారు.
ఇదీ చూడండి :ఔషధాల లేమి... పొంచి ఉన్న ప్రమాదం