తెలంగాణ

telangana

ETV Bharat / state

కురిసింది వర్షం... అన్నదాతకు తెచ్చింది కష్టం... - తడిసిన ధాన్యం

ఆరుగాలం శ్రమించి పండించిన పంట భారీ వర్షానికి తడిసిపోవడం చూసి అన్నదాతలకు దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. వరంగల్​లో నిన్న కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. తమ కష్టం కళ్లెదుటే నీటి పాలవ్వడం చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు.

అకాల వర్షం

By

Published : Apr 19, 2019, 11:20 AM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్​ సబ్​ యార్డు వద్ద నిన్న కురిసిన వర్షానికి కొనుగోలుకు తీసుకువచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కళ్లెదుటే నీటిపాలైన పంటను చూసిన రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సకాలంలో కాంటాలు పెట్టక పోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు వాపోతున్నారు. 25 రోజుల కిందటే వరి కోసినా ఆలస్యంగా కొనుగోలు కేంద్రం ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస వసతులు కూడా లేవన్నారు.
తడిసిన ధాన్యాన్ని అధికారులు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షం వస్తే ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు.

వర్షంతో తడిసిన ధాన్యం

ABOUT THE AUTHOR

...view details