పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఒక్కతే గెలిచి ఏం చేస్తుందనుకోవద్దని, తాను 100 మందితో సమానమని... యువ తెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి అన్నారు. తనను గెలిపిస్తే అన్ని వర్గాల వారికి సేవ చేసి రుద్రమదేవి అనే పేరును నిలబెట్టుకుంటానని ఆమె తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సన్నాహాక సమావేశంలో పాల్గొన్నారు.
'ఎమ్మెల్సీగా గెలిపిస్తే అన్ని వర్గాల వారికి సేవ చేస్తా' - వరంగల్ గ్రామీణ జిల్లా తాజా వార్తలు
తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే అన్ని వర్గాల వారికి సేవ చేసి పేరు నిలబెట్టుకుంటానని... యువ తెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సన్నాహాక సమావేశానికి ఆమె హాజరయ్యారు.
'ఎమ్మెల్సీగా గెలిపిస్తే అన్ని వర్గాల వారికి సేవ చేస్తా'
గతంలో నర్సంపేట నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఓంకార్ అసెంబ్లీలో ఒక్కరే ఉన్నారని ఆమె తెలిపారు. అయినప్పటికీ ఆయన అసెంబ్లీ టైగర్‌గా పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. ఈ నెల 14న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును తనకే వేసి గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: బీమా కోసం హత్యలు.. ఛిద్రమవుతున్న కుటుంబాలు