Monkey Funerals: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీసులు మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్ ఎదురుగా వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం కోతిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది.
Monkey Funerals: పోలీసుల మానవత్వం.. వానరానికి అంత్యక్రియలు - వానరానికి అంత్యక్రియలు
Monkey Funerals: వరంగల్ జిల్లా పోలీసులు మనవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించి అందరి మన్ననలు పొందారు. మంచి పని చేసిన వారిని ప్రజలు, ఉన్నతాధికారులు అభినందించారు.
వానరానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న వర్ధన్నపేట పోలీసులు
ఇది గమనించిన పోలీసులు వానరాన్ని రోడ్డుపై నుంచి తొలగించారు. రోడ్డు పక్కనే గోతి తీసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మూగ జీవి పట్ల పోలీసులు చేసిన మంచి పనికి ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్సై కోలా శ్యాంసుందర్, హెడ్ కానిస్టేబుల్ చిట్టి బాబు, కానిస్టేబుల్ దయాకర్‌లను ప్రజలు, పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
ఇదీ చూడండి:ఖమ్మం నగరం ఎలా మారిందో చూస్తారా?