వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి 58 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి పిల్లల పెళ్లి ఖర్చులు తల్లిదండ్రులకు భారం కాకుండా ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. మొహర్రం పండగ, వినాయక నిమజ్జనం ఉన్నప్పటికీ చెక్కుల పంపిణీ చెయ్యాలనే సంకల్పంతో రెవెన్యూ అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాస్కర్‌తో పలువురు అధికారులు పాల్గొన్నారు.
ప్రజల సంక్షేమమే ముఖ్యం: పెద్ది సుదర్శన్ రెడ్డి - mla
తెరాసకు ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
చెక్కులు అందిస్తూ