తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్​లో పింఛను రద్దీ - collectorate

వరంగల్ గ్రామీణ కలెక్టరేట్​ జనంతో కిక్కిరిసిపోయింది. వివిధ గ్రామాల నుంచి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వారితో కార్యాలయం నిండిపోయింది. ఇంతమంది ఒక్కసారిగా రావడానికి ఓ కారణముంది.

దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన పింఛనుదారులు

By

Published : Feb 11, 2019, 4:44 PM IST

దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన పింఛనుదారులు
సోమవారం వరంగల్ గ్రామీణ కలెక్టర్ కార్యాలయం... ఎప్పటికంటే ఎక్కువ మంది జనంతో నిండిపోయింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లకు దరఖాస్తులు సమర్పించేందుకు జనం భారీగా తరలివచ్చారు. కలెక్టరేట్ నుంచి రశీదు తీసుకొచ్చిన వారికే అవకాశం ఉందని కొత్తగా ఎన్నికైన సర్పంచులు చెప్పడంతో.. ఒక్కసారిగా కలెక్టరేట్​పై పడ్డారు. వికలాంగుల కోటాలో వచ్చిన వారిలో అన్ని అవయవాలు సరిగా ఉన్నవారు కూడా ఉండటం విశేషం.
చాలామంది ఉదయం నుంచే కలెక్టరేట్ వద్ద పడిగాపులు పడ్డారు. ఊళ్లలో రశీదు తెచ్చిన వారికే పింఛను వస్తుందని చెబుతున్నారని... ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు.
మొత్తం మీద గ్రామాల్లో కొత్త సర్పంచులు చేసిన ప్రకటన... కలెక్టరేట్​ సిబ్బందిని ఉక్కిరిబిక్కిరి చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details