వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఓపీ విభాగంలో కంప్యూటర్లు మొరాయించడంతో రోగులు గంటల తరబడి లైన్లలో వేచి చూడాల్సి వస్తోంది.
ఎంజీఎంలో కంప్యూటర్ల మొరాయింపు... రోగులకు తప్పని తిప్పలు - ఎంజీఎం ఆస్పత్రి వార్తలు
ఓపీ విభాగంలో కంప్యూటర్లు మొరాయించడంతో రోగులు, రోగి బంధువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటన వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో చోటు చేసుకుంది. అధికారుల నుంచి ఆదేశాలు వస్తే చిట్టీలు ఇస్తామని సిబ్బంది వెల్లడించారు.
ఎంజీఎంలో మొరాయించిన కంప్యూటర్లు... రోగులకు తప్పని తిప్పలు
మాన్యువల్ పద్ధతిలో చిట్టీలు ఇచ్చేందుకు అధికారుల ఆదేశాల కోసం చూస్తున్నామని తెలిపారు. ఆదేశాలు రాగానే... మాన్యువల్ పద్ధతిలో చిట్టీలను అందజేస్తామని సిబ్బంది వెల్లడించారు.
ఇదీ చూడండి:పొంగిపొర్లిన తాళ్లచెరువు... జల దిగ్బంధంలో వనపర్తి