ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారని.. వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ ఎంపీపీ సౌజన్య ఆరోపించారు. పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ భూమిని.. బినామీ పేర్లతో కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గరీబ్ నగర్ గ్రామ శివారులో.. నూతనంగా నిర్మించిన ఇళ్ల వద్ద ఆందోళన చేపట్టారు.
ఎమ్మెల్యే.. భూ కబ్జాలకు పాల్పడ్డారు: గీసుకొండ ఎంపీపీ
పరకాల ఎమ్మెల్యే భూ వివాదంలో చిక్కుకున్నారు. చల్లా ధర్మారెడ్డి.. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ గీసుకొండ ఎంపీపీ సౌజన్య ఆరోపించారు. సర్కారు భూముల్లో నూతనంగా నిర్మించిన ఇళ్ల వద్ద ధర్నా నిర్వహించారు.
భూ వివాదంలో ఎమ్మెల్యే చల్లా
ఎమ్మెల్యే.. 93వ నంబరు సర్వేలోని ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రి ఇళ్లను ఏర్పాటు చేశారని సౌజన్య మండిపడ్డారు. అధికార పార్టీ వారనే కారణంతో.. అధికారులు సైతం ప్రభుత్వ స్థలమని చూడకుండా ఇంటి నెంబర్‌తోపాటు కరెంటు మీటర్‌ని కేటాయించారని వివరించారు. పేదలకు దక్కాల్సిన భూమిని కాపాడుకునేదాకా ఊరుకోబోమన్నారు.
ఇదీ చదవండి:పిల్లలపై కర్కశంగా వ్యవహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్