దసరా పర్వదినాన జమ్మి అనంతరం పాలపిట్ట చూడడం ఆనవాయితీగా పెద్దలు చెబుతారు. పాలపిట్ట శుభాలకు, విజయాలకు చిహ్నమని విజయదశమి రోజున ఈ పిట్టను చూడగలగడాన్ని ఎంతో అదృష్టంగా, శుభసూచకంగా భావిస్తారు.
పాలపిట్ట దర్శనం.. దసరా పండుగ పరిపూర్ణం
పాలపిట్ట దర్శనంతోనే దసరా సంబురాలు పరిపూర్ణం అవుతాయని రాష్ట్ర ప్రజల విశ్వాసం. ముఖ్యంగా పండుగరోజు పాలపిట్టను చూడటానికి చిన్నాపెద్దా, పిల్లాజెల్లా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తారు. అలాంటిది వరంగల్ గ్రామీణ జిల్లా వర్థన్నపేట ప్రజలకు ఆ పాలపిట్ట దర్శనం లభించింది. మనమూ ఆ ఎక్స్క్లూసివ్ విజువల్స్‌ను చూసి మన దసరా సంబురాలను అంబరాన్నంటేలా చేసుకుందామా..!
పాలపిట్ట దర్శనం.. దసరా పండుగ పరిపూర్ణం
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో పాలపిట్ట దర్శనం ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ విజువల్స్ ఈటీవి భారత్ కెమెరాకు చిక్కాయి. దసరా అనగానే ఆ పక్షి కోసం తహతహలాడే ప్రజలకు పాలపిట్ట దర్శనం కనువిందు చేసింది.
ఇదీ చూడండి:పండగపూట భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ
Last Updated : Oct 25, 2020, 7:10 PM IST