వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో సహకార ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వారం రోజులపాటు సాగిన హడావిడికి నేటితో తెరపడింది. వర్ధన్నపేట మండల పరిధిలో 13 వార్డులకుగానూ 7 వార్డులు ఏకగ్రీవం కాగా... మిగిలిన ఆరు వార్డులకు నేడు పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్లో అధికార తెరాస పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. గెలిచిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
వర్ధన్నపేటలో తెరాసదే 'సహకారం' - సహకార ఎన్నికలు
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన సహకార ఎన్నికల్లో తెరాస బలపరిచిన అభ్యర్థులు జయభేరి మోగించారు. కాంగ్రెస్, భాజపా బలపరిచిన అభ్యర్థులు ఖాతా తెరవకపోవడం చర్చనీయాంశంగా మారింది.
వర్ధన్నపేటలో తెరాసదే 'సహకారం'
అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుతో వర్ధన్నపేటలో సంబురాలు అంబరాన్నంటాయి. మిఠాయిలు పంచుకుంటూ రంగులతో పార్టీ శ్రేణులు విజయోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. కాంగ్రెస్, భాజపా పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఒక్కరు కూడా ఖాతా తెరవకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చూడండి:కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా