స్థానిక సంస్థల రెండో విడతకు నామపత్రాల స్వీకరణ - 2ND PHASE ELECTIONS
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికలకు అధికారులు నామ పత్రాలు స్వీకరించారు. పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలివచ్చారు.
రెండో విడత ఎన్నికలకు నామ పత్రాలు స్వీకరించిన అధికారులు
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రెండో విడత నామినేషన్లు ప్రారంభమయ్యాయి. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో తొలిరోజు నామపత్రాలు దాఖలుకు అభ్యర్థులు ఉత్సాహం చూపారు. శుక్రవారం శుభ సూచకంగా భావించి ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడం వల్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది.
ఇవీ చూడండి : జన బలం, ఐక్యతా మంత్రంతో కాశీ బరిలోకి...