ఏ వర్గానికి చెందిన మహిళలపై అఘాయిత్యాలు జరిగినా... ప్రభుత్వాలు, పార్టీలు, సమాజం ఒకే విధంగా ఖండించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
దిల్లీకో న్యాయం... గల్లీకో న్యాయమా? - మందకృష్ణ మాదిగ
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పార్టీలు, ప్రభుత్వాలు, సమాజం ఒకే విధంగా ఖండించేలా ఉండాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
అగ్రవర్ణ మహిళలపై జరిగే ఆకృత్యాలను ఓ విధంగా.. అణగారిన వర్గాలకు చెందిన ఆడవారిపై జరిగే అఘాయిత్యాలను మరో విధంగా చూస్తున్నారని ఆరోపించారు.
దిల్లీకో న్యాయం గల్లీకో న్యాయమా అని ప్రభుత్వాలను నిలదీశారు. మహిళలపై జరుగుతున్న సంఘటనలపై స్పందన ఒకే విధంగా ఉండాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : దిశ సెల్ఫోన్ గుర్తించిన పోలీసులు