వరంగల్ రూరల్ జిల్లా పరకాల పురపాలక సంఘానికి రూ.20 కోట్లు మంజూరు చేయమని సీఎం కేసీఆర్ను కోరనున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. ఈరోజు ఉదయం వార్డుల్లో కలియ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు పడక గదుల ఇళ్లు, పారిశుద్ధ్య సమస్యలపై ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ప్రభుత్వాలు మారినా ఏ తమ పరిస్థితి మారడం లేదని ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
'పరకాల అభివృద్ధికి రూ. 20కోట్లు అడుగుతా' - mla
పరకాల పురపాలక సంఘం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.
20కోట్లు అడుగుతా