తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి : పెద్ది సుదర్శన్ రెడ్డి - warangal news

మీ వార్డులో మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించడం జరిగింది. ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

mla sudheer reddy participated in mee wardlo mee mla programme
ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి :ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

By

Published : Dec 23, 2020, 6:45 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో 'మీ వార్డులో మీ ఎమ్మెల్యే' కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

పరిష్కరిస్తానని హామీ..

వార్డులోని ప్రజలతో కలిసి సమస్యలను గుర్తించారు. ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తానని తెలిపారు. అంతర్గత రోడ్లు, తాగునీరు డ్రైనేజీ సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన ఈటీవీ తెలంగాణ, ఈనాడును ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'దేశానికి దిక్సూచి చూపించిన మహానేత పీవీ'

ABOUT THE AUTHOR

...view details