రామప్ప-పాకాల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు వెనక ఒక్కొక్క మతలబు అర్థమవుతోందని... నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. పూర్తిగా సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుకు అడ్డుకాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గతంలో ఇక్కడి నాయకులు ఇచ్చిన వాదనలు... ఏపీ ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఒకే తీరుగా ఉన్నాయని ధ్వజమెత్తారు.
అక్రమ ప్రాజెక్టు అంటూ
పూర్తి అనుమతులు సాధించిన ప్రాజెక్టుకు అనుమతులే లేవంటూ... అక్రమ ప్రాజెక్టు అంటూ ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాదిస్తున్నాడని ఆక్షేపించారు. ఇక్కడ వారి జెండాలు మోసే నాయకులు దీనికి ఏం సమాధానం చెబుతారని సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న రైతులకు కూడా నీళ్లు వస్తాయి కదా అని వివరించారు. ఇలా అడ్డగోలు వాదనలతో ప్రాజెక్టును ఆపాలని ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు.