పాలన సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పడ్డ మండలాలకు మహర్దశ ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండల కేంద్రంలో రెవెన్యూ అధికారులతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. ప్రభుత్వ స్థలాలను ఎవరు ఆక్రమించిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు.
'ప్రభుత్వ స్థలాలను ఎవరు ఆక్రమించిన కఠిన చర్యలే' - పరకాల ఎమ్మెల్యే
వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండల కేంద్రంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. నూతనంగా ఏర్పడ్డ మండలాలకు మహర్దశ ఉంటుందని పేర్కొన్నారు.
'ప్రభుత్వ స్థలాలను ఎవరు ఆక్రమించిన కఠిన చర్యలే'
మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలాలన్ని సర్వే చేయించి హద్దులు పెట్టాలని సూచించారు. తదుపరి ఎక్కడ ఏయే కార్యాలయాలు నిర్మించాలో నిర్ణయిస్తామన్నారు. నూతనంగా ఏర్పడ్డ నడికూడ మండలానికి 40వేల మెట్రిక్ టన్నుల నిలవచేసుకునే సామర్థ్యం గల శీతల గిడ్డంగి మంజూరు అయినట్లు తెలిపారు.
ఇదీ చూడండి :ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే!