తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని(telangana formation day 2021) వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్, తెరాస పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే - వర్ధన్నపేటలో తెలంగాణ ఆవిర్భావ వేడుక
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో మండల ప్రజా పరిషత్, తెరాస పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల (telangana formation day 2021)కు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసి నియోజక వర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
జాతీయ జెండాను ఆవిష్కరించి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించలేకపోయామని ఆయన అన్నారు. వచ్చే సంవత్సరం ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున నర్వహిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఈ వానాకాలంలో వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపాలి: నిరంజన్ రెడ్డి