మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, నియోజకవర్గంలోని పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానం - మంత్రి కేటీఆర్‌లు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు.. ఎంతో కృషి చేసి, రాష్ట్రానికి అనేక కంపెనీలను తీసుకొచ్చారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. వాటి వల్ల.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. ప్రతిపక్షాలు అనవసర ప్రసంగాలు చేస్తూ పబ్బం గడుపుతున్నాయంటూ విమర్శించారు. ప్రశ్నించే వారిని కాక, సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్న పల్లాను గెలిపించాలని కోరారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా.. నియోజకవర్గంలోని పారిశుద్ధ్య కార్మికులను ఆయన ఘనంగా సన్మానించారు.
ఇదీ చదవండి:కరోనా బారినపడిన మంత్రి సత్యవతి రాఠోడ్