తెలంగాణ

telangana

ETV Bharat / state

​​​​​​​మిర్చి రైతుల ఆందోళన.. - పోలీస్​

మిర్చి విక్రయాల్లో తమకు అన్యాయం జరుగుతోందని వరంగల్​ ఎనుమాములు వ్యవసాయ మార్కెట్​లో రైతులు ఆందోళనకు దిగారు.   కనీసం క్వింటాకు రూ.10 వేలు గిట్టుబాటు ధర ఇవ్వాలని కర్షకులు డిమాండ్ చేశారు.

వ్యవసాయ మార్కెట్​లో రైతుల ఆందోళన

By

Published : Feb 7, 2019, 7:11 PM IST

వ్యవసాయ మార్కెట్​లో రైతుల ఆందోళన
రాష్ట్రంలోనే అతిపెద్దదైన వరంగల్​ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్​ చేస్తూ మిర్చి యార్డు కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం క్వింటా మిర్చి ధర 8 వేలు ప్రకటించినా..నాణ్యత పేరు చెప్పి రూ. 6 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అన్నదాతలకు నచ్చచెప్పి ఆందోళనను విరమింపజేశారు.
రైతన్నల ఆందోళనతో మార్కెట్​ యార్డులో క్రయవిక్రయాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కనీస ధరను రూ.10 వేలకు పెంచితే తప్ప తమకు గిట్టుబాటు కాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details