తెలంగాణ

telangana

ETV Bharat / state

నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు తాజా వార్తలు

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్‌ గ్రామీణ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సందర్శించి.. నష్టపోయిన పంటలను పరిశీలించారు. ప్రభుత్వం వీలైనంత వరకు ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

By

Published : Aug 21, 2020, 3:38 PM IST

గత పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ గ్రామీణ జిల్లాలో రైతులు నష్టపోయారు. వర్షానికి నష్టపోయిన పంటలు, కొట్టుకుపోయిన రోడ్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు.

నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, నర్సంపేట, ఖానాపురం మండలాల్లో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పత్తి, వేరుశనగ, వరి పంటలతో పాటు రోడ్లను పరిశీలించారు. మంత్రి వెంట నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జడ్పీవైస్ ఛైర్మెన్ ఆకుల శ్రీనివాస్, వ్యవసాయశాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉన్నారు.

ఇదీ చూడండి:'దట్టమైన పొగల వల్లే లోనికి వెళ్లడం కష్టమవుతోంది'

ABOUT THE AUTHOR

...view details