వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేటలో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళా రైతులకు సాంకేతిక ఉపకరణాలు అందించారు. సాంకేతికతో రైతులు.. వ్యవసాయంలో ప్రగతి సాధించాలన్నారు. పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) రైతులకు సాగు ఉపకరణాలు అద్దెకిచ్చే కేంద్రాన్ని చెన్నారావుపేటలో ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు.
రైతులు సాగులో ప్రగతి సాధించాలి : మంత్రి ఎర్రబెల్లి - వరంగల్ తాజా వార్తలు
సాంకేతిక ఉపకరణలతో రైతులు వ్యవసాయంలో ప్రగతి సాధించాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావు పేటలో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో రూ.64లక్షలు విలువ చేసే వ్యవసాయ పనిముట్లను స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌తో కలసి మహిళా రైతులకు అందించారు.
ఈ పరికరాలను మహిళ రైతులు సద్వినియోగం చేసుకొని తమ సొంత కాళ్లపై నిలబడాలన్నదే సీఎం ఉద్దేశమని ఆయన అన్నారు. ఒకప్పుడు ఇంటికే పరిమితం అయిన మహిళలు నేడు కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా అభివృద్ధి చెందుతూ సమాజంలో మంచి గుర్తింపు గౌరవాన్ని పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ హరిత, సెర్ప్ అధికారులు, మహిళా రైతులు పాల్గొన్నారు. మహిళలు వేసిన కోలాటాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: రాయదుర్గం చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్టు