వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు రోడ్ నుంచి వర్దన్నపేట మండలం ల్యాబర్తి క్రాస్, వయా రోళ్లకల్, కల్లెడ వరకు ఆకేరు వాగు మీదుగా 5.23 కి.మీ రోడ్డుతో పాటు ఆకేరువాగుపై బ్రిడ్జీ నిర్మాణం చేయడానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli) (PMGSY)పీఎంజీఎస్వై పథకం క్రింద 10 కోట్ల 43 లక్షలు మంజూరు చేశారు. ఆదివారం మంత్రి దయాకర్ రావు కొత్తూరు గ్రామంలోని ప్రతిపాదిత రోడ్డు, వంతెన నిర్మాణ స్థలాన్ని సందర్శించి, పరిశీలించారు.
Errabelli: మంత్రి ఎర్రబెల్లి చొరవతో వంతెన మంజూరు - ఎర్రబెల్లి దయాకర్ రావు వార్తలు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli dayakar) చొరవతో మూడు మండలాల ప్రజల కల నెరవేరనుంది. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు రోడ్ నుంచి వర్దన్నపేట మండలం ల్యాబర్తి క్రాస్, వయా రోళ్లకల్, కల్లెడ వరకు ఆకేరు వాగు మీదుగా 5.23 కి.మీ రోడ్డుతో పాటు ఆకేరువాగుపై వంతెన నిర్మాణం చేయడానికి మంత్రి ఎర్రబెల్లి రూ.10 కోట్ల 43 లక్షలు మంజూరు చేశారు.
Errabelli: మంత్రి ఎర్రబెల్లి చొరవతో వంతెన మంజూరు
రోడ్డు నిర్మాణానికి 4కోట్ల 47లక్షలు, బ్రిడ్జి నిర్మాణానికి 5 కోట్ల 96 లక్షల అంచనాలతో పనులకు టెండర్లు పిలిచామని అన్నారు. తొందరగా టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆకేరువాగుపై బ్రిడ్జి నిర్మాణంతో రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల రైతుల వ్యవసాయ అవసరాలతోపాటు, వ్యాపార అవసరాలకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుందని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:'రుతుపవనాల రాక రెండు రోజులు ఆలస్యం'