మన ఇంటితోపాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని రోగ రహితంగా మార్చవచ్చని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రతి ఆదివారం పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా సతీమణి ఉషా దయాకర్ రావు తో కలిసి మంత్రి పారిశుద్ధ్య పనులు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి లోని తమ ఇంటి ఆవరణలో చెత్తను ఏరారు. దోమల నివారణతో మలేరియా, డెంగీ వంటి అనేక అంటు, సీజనల్ వ్యాధులను నివారించవచ్చన్నారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపుని ప్రతి ఒక్కరూ పాటించి సామాజిక ఉద్యమంగా చేపట్టాలని కోరారు.
ఇంటి ఆవరణ, పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత: మంత్రి - minister erraballi latest updates
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన నివాసంలో శ్రమదానం చేశారు. ప్రతి ఆదివారం పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా సతీమణితో కలిసి నీటి నిల్వలు తొలగించారు.
వీఐపీలే కాదు ప్రతిఒక్కరు పాటించాలి: మంత్రి ఎర్రబెల్లి
ఇదీ చూడండి: ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు కరోనా పాజిటివ్