వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. మరణించిన రైతు కుటుంబాలకు రైతుబంధు బీమా చెక్కులను అందజేశారు. రానున్న రోజుల్లో రైతులు సంఘాలుగా ఏర్పడి విత్తన కొనుగోలు నుంచి పండించిన పంటలను అమ్ముకునేలా ప్రణాళికలు చేసుకోవాలన్నారు. పంటల వారీగా రైతులు సభ్యులుగా సంఘాలు ఏర్పరుచుకోవాలని ఆయన సూచించారు. ఈ కమిటీలలో రైతులే కాకుండా భూమి లేని ఇతర పనులు చేసుకునేవారు కూడా ఈ సంఘాలలో సభ్యులుగా చేరవచ్చని అన్నారు.
క్షీర విప్లవం సృష్టించాలి : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి - వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో
రైతులందరూ సమన్వయ కమిటీలో సభ్యులుగా చేరితే రానున్న రోజుల్లో అన్ని రకాల లాభాలు పొందవచ్చునని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో క్షీర విప్లవం సృష్టించాలని సూచించారు.
క్షీర విప్లవం సృష్టించాలి : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఈ సంఘాలకు భవిష్యత్తులో ప్రమాద బీమా వచ్చెట్లుగా, ఇన్సూరెన్సు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. కొత్తగా రాష్ట్రంలో నర్సంపేట నియోజకవర్గంలో ప్రథమంగా దళితులకు నాలుగు లక్షల రూపాయల విలువ చేసే నాలుగు బర్రెలు వారికి అందిస్తున్నామన్నారు. మొదటగా 450 మందికి అందిస్తున్నామని రెండో విడతలో మరో 300 మంది నెక్కొండ నల్లబెల్లి మండలాలకు చెందినవారికి అందిస్తామని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి : నగరవాసులను రారమ్మంటున్న జంగిల్ ఫారెస్ట్ క్యాంప్