తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసుపత్రి అభివృద్ధికి తలో చెయ్యి..! - MLA

ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్యులు అందరూ ఒక్క చోట చేరారు. ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు చేయాలంటే ఏం చేయాలని చర్చించుకున్నారు. ఉన్న సమస్యలు తీర్చటానికి సమష్టి కృషి చేద్దామని తీర్మానించుకున్నారు.

MGM HOSPITAL DEVOLOPMENT COMMITEE MEETING

By

Published : Feb 12, 2019, 7:42 PM IST

వరంగల్​ ఎంజీఎంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశమై పలు కీలక ప్రతిపాదనలు చేసింది. సమావేశానికి జిల్లా పాలానాధికారితో పాటు ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
ప్రజలకు అన్ని సమయాల్లో మెరుగైన వైద్య సేవలందిస్తున్నందుకు వరంగల్​ ఎంజీఎం వైద్యులను జిల్లా పాలనాధికారి అభినందించారు. అందరు సమష్టిగా పని చేసి ఆసుపత్రిని మెరుగు పర్చాలని కోరారు. ఆసుపత్రికి రూ.25 లక్షలతో వెంటిలేటర్ సౌకర్యం ఉన్న అంబులెన్సులు అందజేస్తానని ఎమ్మెల్యే వినయ్​భాస్కర్​ హామీ ఇచ్చారు. తూర్పు ఎమ్మెల్యే నరేందర్ తన నిధుల నుంచి కోటి రూపాయలను ఆసుపత్రి అభివృద్ధికి కేటాయిస్తానని ప్రకటించారు.
ఇవేకాక నూతనంగా 20 పడకల ఐసీయూ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయడంతో పాటు విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి డీపీఆర్​ తయారుచేయాలని అధికారులు సంకల్పించారు.

ABOUT THE AUTHOR

...view details