తెలంగాణ

telangana

అన్నారం దర్గాలో బూజు పట్టిన లడ్డూలు

By

Published : Apr 16, 2021, 9:05 PM IST

రాష్ట్రంలోని ప్రముఖ దర్గాల్లో ఒకటైన అన్నారం షరీఫ్ దర్గాలో నిర్వహణ పక్కదారి పడుతోంది. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే దర్గాలో.. నిర్వాహకుల నిర్లక్ష్యంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాడైనా ప్రసాదాలు విక్రయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

annaram shareef dargah
అన్నారం దర్గా

వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ దర్గాకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. ప్రసాదం కొనుగోలు చేసిన భక్తులు.. తినేందుకు లడ్డూను రెండు ముక్కలు చేశారు. లోపల మొత్తం బూజు పట్టి కనిపించడంతో ఆగ్రహానికి గురై.. ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

బూజు పట్టిన లడ్డూలు

సరైన స్పందన రాకపోవడంతో భక్తులకు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మొక్కులు చెల్లించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తే.. ఇలా పాడైనా లడ్డూలు ప్రసాదంగా ఇస్తారా అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:తెలంగాణ ఎడ్​సెట్​ నోటిఫికేషన్ విడుదల

ABOUT THE AUTHOR

...view details