ETV Bharat / state
శిల్ప కళ బాగుంది... కల్లు రుచీ అదిరింది...! - VISITORS
మన శిల్ప సంపదను చూసేందుకు సముద్రాలు దాటి వచ్చారు. శిల్ప కళను చూసి ఆశ్చర్య పోయారు. అంతేనా... తాటి కల్లు రుచికి ఫిదా అయ్యారు.
గణపేశ్వరాలయంలో విదేశీయుల యోగా...
By
Published : Feb 10, 2019, 8:13 PM IST
| Updated : Feb 25, 2019, 5:49 PM IST
గణపేశ్వరాలయంలో విదేశీయుల యోగా... జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో జర్మనీ దేశస్థులు సందడి చేశారు. సుమారు 10 రోజులుగా వరంగల్లోని పురాతన ఆలయాలను సందర్శిస్తున్న 50 మంది విదేశీయులు... గణపేశ్వరాలయాన్ని చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ శిల్ప సంపదను ఆసక్తిగా తిలకించారు. జర్మనీకి చెందిన శ్రీసాయి ట్రస్టు ప్రాణికల్ యోగా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. ఆలయ సమీపంలో వున్న తాటి వనం వద్ద కల్లు సేవించారు. అద్భుతంగా వుందంటూ కితాబిచ్చారు. గీత కార్మికులు చెట్లను ఎక్కడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
Last Updated : Feb 25, 2019, 5:49 PM IST