వరంగల్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత - MAHADEVAPUR
ఓ లారీలో 20 టన్నుల అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుదురుపల్లి ప్రాంతంలో సీఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో అక్రమ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు