తెలంగాణ

telangana

ETV Bharat / state

లాభాల బాటలో 'తొర్రూరు ఆర్టీసీ' - tsrtc

ఒకప్పుడు నష్టాలతో సాగిన ఆర్టీసీ డిపో నేడు లాభాల్లో దూసుకుపోతూ రాష్ట్రంలో మూడో స్థానం దక్కించుకుంది. ఏడు నెలల్లో 2.63కోట్లతో వృద్ధి బాటలో ప్రయాణిస్తోంది.

లాభాల్లో తొర్రూరు ఆర్టీసీ

By

Published : Feb 15, 2019, 4:40 PM IST

లాభాల్లో తొర్రూరు ఆర్టీసీ
వరంగల్ జిల్లాలోని తోర్రూరు ఆర్టీసీ లాభాల్లో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో మూడోస్థానం జిల్లాలో రెండోస్థానంలో నిలుస్తోంది. 2014-15లో ఐదు కోట్ల నష్టంలో ఉంటే 2018 ఏప్రియల్​ నుంచి నవంబర్ వరకు 2.63 కోట్లతో లాభాల బాట పట్టింది.
ప్రతిరోజు 34 వేల కిలోమీటర్లు తిరుగుతూ 35 వేలమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. కొత్త బస్సులను ప్రభుత్వం అందిస్తే ఇంకా ఎక్కువ లాభాలు సాధిస్తామని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు.
నష్టాల నుంచి తేరుకుని లాభాలవైపు అడుగులు వేయడం పట్ల ఆర్టీసీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details