తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులను కన్నీట ముంచిన అకాల వర్షం

ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షానికి నీట మునిగింది. వరంగల్​ గ్రామీణ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యపు రాసులు వర్షార్పణమయ్యాయి. రైతుకు తీరని నష్టం మిగిలింది.

huge-loss-for-heavy-rain-in-waragal
రైతులను కన్నీట ముంచిన అకాల వర్షం

By

Published : May 30, 2020, 3:38 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వచేసిన వరి ధాన్యం రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది. జిల్లాలోని దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. నల్లబెల్లి మండలం మేడిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో మక్కలు, వడ్లు తడిసిపోయాయి. ఖానాపురం మండలం ధర్మరావు పేట అశోక్​నగర్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీట మునిగింది.

దుగ్గొండి మండలం వెంకటాపురంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సైతం వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. ఉదయాన్నే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని... ప్రభుత్వమే ప్రతీ గింజ కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: క్లినికల్ ట్రయల్స్​కు 'సన్​ఫార్మా'కు అనుమతి

ABOUT THE AUTHOR

...view details