వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని ఏకేతండా, సూర్యతండా, కొత్తూరు, జేతురాం తండాలలో వర్ధన్నపేట ఎక్సైజ్ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 5 లీటర్ల గుడుంబా, 50 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న గుడుంబా తయారీకి అధికారుల చూసిచూడని వ్యవహార శైలి వల్లే శాశ్వత ప్రయోజనం ఉండట్లేదని ప్రజలు వాపోతున్నారు. కఠినమైన శిక్షలు పడేలా చేసినప్పుడే గుడుంబా తయారీకి పూర్తిగా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని పలు గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు.
'5 లీటర్ల గుడుంబా,50 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం' - RAYAPARTHI MANDAL
అబ్కారీ శాఖ అధికారులు ఎన్ని దాడులు చేసినా.. ఎన్ని నిబంధనలు పెట్టినా... గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా తయారీ మాత్రం జరుగుతూనే ఉంది. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప... పూర్తిగా నివారించలేరని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
ఇవీ చూడండి : శంషాబాద్ విమానాశ్రయంలో 11 కిలోల బంగారం సీజ్