వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలోని నీలగిరిస్వామితండా, గుబ్బెటితండా, డీసీతండా, రాయపర్తి మండలం బోటికిందితండాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 5 లీటర్ల గుడుంబాతో పాటు 100 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోశారు. ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తరచూ దాడులు నిర్వహిస్తున్నా గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా తయారీ అవుతూనే ఉండడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది.
తండాల్లో ఏరులై పారుతున్న గుడుంబా - NALLA BELLAM
తండాల్లో గుడుంబా ఏరులై పారుతూనే ఉంది. అధికారులు ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా ఫలితం లేకుండా పోతోంది. గట్టి చర్యలు చేపట్టకపోవడం వల్లే గుడుంబా తయారీకి కళ్లెం వేయలేకపోతున్నారనేది పలువురి వాదన.
తండాల్లో ఏరులై పారుతున్న గుడుంబా