కరోనా మరణించిన వారిని చూసేందుకు ఆత్మీయులే ముందుకు రాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆదర్శంగా నిలిచారు ఓ యువకుడు. వైరస్‌తో మృతి చెందిన వ్యక్తికి అన్నీ తానై అంత్యక్రియలు పూర్తి చేశాడు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో బక్క నర్సయ్య (40) అనే వ్యక్తి కొవిడ్ బారిన పడి అవగాహన లేక ఇంటి వద్దే మృత్యువాత పడ్డాడు. గ్రామస్థులు కరోనా భయంతో దగ్గరికి వెళ్లేందుకే సాహసం చేయలేదు. అదే గ్రామానికి చెందిన గోవర్ధన్ ముందుకు వచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు.
ఎవరూ దగ్గరకు రాలేదు.. అన్నీ తానై..! - కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన యువకుడు
కరోనా మహమ్మారి పేరు వింటేనే జనాలు జడుసుకుంటున్నారు. అయినా వారు సైతం అంత్యక్రియలకు ముందుకు రావటం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మానవత్వం చాటుకున్నాడు ఓ యువకుడు. కొవిడ్‌తో మృతిచెందిన వ్యక్తికి అన్నీ తానై దహన సంస్కరాలు నిర్వహించారు.
కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన యువకుడు
ఇంటి పెద్ద చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించిన ఘటన అందరిని కంటతడి పెట్టించింది. మానవత్వంతో ముందుకు వచ్చి అంతిమ సంస్కరాలు నిర్వహించిన గోవర్ధన్ అనే యువకుడిని గ్రామస్థులు అభినందించారు. అనంతరం గ్రామంలో సర్పంచ్ తిరుపతి రెడ్డి హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.