వరంగల్ గ్రామీణ జిల్లా రాజుపేట గ్రామ శివారు జంగాలపల్లి తండాకు చెందిన గుగులోతు మధు వడదెబ్బతో మరణించాడు. ఈరోజు ఉదయం ఎప్పటిలాగానే వ్యవసాయ భూమి పనులకు వెళ్లిన మధు ఎండతీవ్రత అధికంగా ఉండటం వల్ల సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యలోనే చనిపోయాడు. మృతుని బంధువుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.
వడదెబ్బతో రైతు అకాల మరణం - వడదెబ్బ
వడదెబ్బ తగిలి ఓ రైతు అకాల మరణం చెందాడు. రోజులాగే వ్యవసాయ పనులకు వెళ్లి.. ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల సొమ్మసిల్లి పడిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు.
రైతు అకాల మరణం