తెలంగాణ

telangana

ETV Bharat / state

'3 వారాలైనా.. కొనుగోళ్లు జరపడం లేదు' - రైతుల ఆందోళన

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలో రైతులు రోడ్డెక్కారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదంటూ ఇల్లంద వ్యవసాయ మార్కెట్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

farmers protest
farmers protest

By

Published : May 17, 2021, 12:01 PM IST

ధాన్యాన్ని కేంద్రానికి తరలించి మూడు వారాలు గడుస్తోన్నా.. కొనుగోలు జరపడం లేదంటూ వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ మార్కెట్​ ఎదుట బైఠాయించిన అన్నదాతలు.. వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై 3 గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు రైతులు. ముంచుకొస్తున్న వర్షాల వల్ల తాము నష్టపోకుండా అధికారులు కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.

ఇదీ చదవండి:కొవిడ్ నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్

ABOUT THE AUTHOR

...view details