వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను రైతులు అడ్డుకున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద కొనుగోలు కేంద్రంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు ఆందోళనకు దిగారు. మూడు వారాలైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు... అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను అడ్డుకున్నారు.
'మా ఎమ్మెల్యేకు మీరైనా చెప్పండి సార్' - తెలంగాణ వార్తలు
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు అడ్డుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా ఇల్లందులో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరగడం లేదని అన్నదాతలు ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
జాతీయ రహదారిపై అన్నదాతల ఆందోళన, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను అడ్డుకున్న రైతులు
'మా ఎమ్మెల్యేకు మీరైనా చెప్పండి సార్' అంటూ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన ఉన్నందున రైతులు ఆందోళన చేయడం మంచిది కాదని అన్నారు. వేగంగా ధాన్యం కొనుగోళ్లు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.