తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల వద్దకే కొనుగోలు కేంద్రాలు: మంత్రి ఎర్రబెల్లి - రైతుల వద్దకే కొనుగోలు కేంద్రాలు: మంత్రి ఎర్రబెల్లి

అన్నదాతకు సర్కార్ వెన్నుదన్నుగా నిలుస్తుందని.... మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్ అన్నారు. రైతులెవరూ అధైర్యరపడవద్దని...ప్రతి గింజనూ సర్కార్ కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. వరంగల్ పట్టణ, గ్రామీణ జిల్లాల్లో ధాన్యం, మక్కలు కొనుగోలుపై అధికారులతో సమీక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Farmers' buying centers in Erraballi
రైతుల వద్దకే కొనుగోలు కేంద్రాలు: మంత్రి ఎర్రబెల్లి

By

Published : Apr 1, 2020, 1:54 PM IST

రైతుల వద్దకే కొనుగోలు కేంద్రాలు: మంత్రి ఎర్రబెల్లి

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ దృష్ట్యా వ్యవసాయ మార్కెట్లు మూసివేసినా...రైతులెవరూ ఆందోళన చెందనవసరం లేదని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్ హామీ ఇచ్చారు. గ్రామాల్లోనే పంటల కొనుగోలుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ధాన్యం సేకరణ పంటల కొనుగోళ్లు, యంత్రాల అందుబాటు, టోకెన్ల జారీ, గిడ్డంగుల అందుబాటు తదితర అంశాలపై వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో మంత్రులు సమీక్షించారు.

72 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు...

వరంగల్ అర్బన్ జిల్లాలో వరి విస్తీర్ణం... 74.075 ఎకరాలు కాగా... లక్షా 77 వేల706 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 72 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1585 టార్పాలిన్లలో 668 అందుబాటులో ఉన్నాయని ఇంకా 917 కొనాల్సి ఉంటుందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మొక్క జొన్న విస్తీర్ణం 41,547 ఎకరాలు కాగా... లక్షా 32 వేల 950 మెట్రిక్‌ టన్నుల మేర దిగుబడి వస్తుందని దీనిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 72 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

కొనుగోలుకు విస్తరంగా ఏర్పాట్లు

వరంగల్‌ గ్రామీణ జిల్లాలో మొత్తం వరి విస్తీర్ణం 86,780 ఎకరాలు కాగా... రెండు లక్షల 8 వేల 185 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు మంత్రులు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సారి 251 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరి కోత యంత్రాలు 128 అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈసారి లక్ష 750 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్నలు వేయగా.. రెండు లక్షల 46 వేల 631 మెట్రిక్‌ టన్నుల మేర దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 65 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు.

ఆఖరి గింజ వరకూ కొంటాం

పంటలు చేతికొచ్చేనాటికి కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా ఉండాలని... రైతులకు ఎలాంటి ఇక్కట్లు ఉండరాదని మంత్రులు అధికారులను ఆదేశించారు. వరిధాన్యం కొనుగోలుకు 30 వేల కోట్లు, మక్కల కొనుగోలుకు 3 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పంటలు చేతికొచ్చే సమయానికి రైతుల ముంగిటే... కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా ఉంటాయని వెల్లడించారు. రైతులు కూడా తొందరపడి ఆగం కావద్దని... ఆఖరి గింజ వరకూ కొనుగోళ్లు జరుపుతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... హైదరాబాద్​లో 'దిల్లీ' కుదుపు.. జమాత్​కు వెళ్లొచ్చిన వారే కారణం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details