వరంగల్ గ్రామీణ జిల్లా ఉప్పరపల్లి గ్రామంలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని అబ్కారీ శాఖ అధికారులు ప్రారంభించారు. గౌడ కులస్థులకు తాటి, ఈత ఇతర మెుక్కలను పంపిణీ చేసిన అనంతరం మొక్కలు నాటారు.
హరితహారంలో మెుక్కలు నాటిన అబ్కారీ శాఖ అధికారులు - ఆరో విడత హరితహారం
వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని అబ్కారీ శాఖ అధికారులు ప్రారంభించారు. ఉప్పరపల్లి గ్రామంలో గౌడ కులస్థులతో కలిసి మెుక్కలు నాటారు.
హరితహారంలో మెుక్కలు నాటిన అబ్కారీ శాఖ అధికారులు
ప్రతీ ఒక్కరు 5 మెుక్కలు నాటాలని.. వాటిని కంటికి రెప్పలా కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని అబ్కారీ శాఖ అధికారి కరుణశ్రీ సూచించారు. అలాగే సంగెo మండలం షాపూర్ గ్రామంలో కూడా గౌడన్నలతో కలిసి మొక్కలు నాటారు.
ఇవీ చూడండి: పచ్చని పండుగ: హరిత తెలంగాణే లక్ష్యం... ప్రతిమొక్కనూ బతికిద్దాం