ఎన్నికల నిర్వహణపై జాయింట్ కలెక్టర్ సమీక్ష - mahendar
ప్రాదేశిక ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ కృషి చేయాలని వరంగల్ గ్రామీణ జిల్లా జాయింట్ కలెక్టర్ మహేందర్ ఆదేశించారు. పరకాలలో ఎమ్మార్వో, వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు.
వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల ఆర్డీవో కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో ఎన్నికలపై సమీక్షా సమావేశం జరిగింది. ఎమ్మార్వో, వీఆర్వోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ సమక్షంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసులకు ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ బూత్‌లను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని మహేందర్ సూచించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా అందరూ కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.