తెలంగాణ

telangana

ETV Bharat / state

వసుంధర, ప్యాంపర్స్​ ఆధ్వర్యంలో 'పాపాయీ ఆరోగ్యమస్తు'

వరంగల్​ గ్రామీణ జిల్లా నర్సంపేటలో 'ఈనాడు వసుంధర కుటుంబం, ప్యాంపర్స్​' సంయుక్తంగా 'పాపాయీ ఆరోగ్యమస్తు' పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

వసుంధర, ప్యాంపర్స్​ ఆధ్వర్యంలో 'పాపాయీ ఆరోగ్యమస్తు'

By

Published : Aug 7, 2019, 4:39 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలోని 'ఈనాడు వసుంధర కుటుంబం, ప్యాంపర్స్'​ సంయుక్తంగా చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 'పాపాయీ ఆరోగ్యమస్తు' పేరిట నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి మధుసూదన్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలు పుట్టిన గంటలోగా తల్లిపాలు పట్టించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయని తెలిపారు. తల్లిపాలు అమృతంతో సమానమని చిన్న పిల్లలు, స్త్రీ వైద్య నిపుణులు డా. గోపాల్​, డా. నవత తెలిపారు. పిల్లల పెంపకంపై పలు సూచనలు చేశారు. చిన్న పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్యాంపర్స్​ తయారుచేస్తున్నట్లు ఆ సంస్థ సేల్స్​ మేనేజర్​ కాశీనాథ్ తెలిపారు. ​ ఈ కార్యక్రమంలో ఈనాడు వరంగల్​ యూనిట్​ మేనేజర్​ రాజు, పలువురు అంగన్​వాడీ, ఆశా కార్యకర్తలు, చంటి పిల్లల తల్లులు హాజరయ్యారు.

వసుంధర, ప్యాంపర్స్​ ఆధ్వర్యంలో 'పాపాయీ ఆరోగ్యమస్తు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details